ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఈ-బస్సు సేవా పథకంలో భాగంగా తొలి దశలో 750 బస్సులను రాష్ట్రానికి పంపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. బస్సుల టెండర్లు ఇప్పటికే పూర్తవ్వగా.. రాష్ట్రానికి బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాక ఏపీలో విద్యుత్ బస్సులు పరుగులు పెట్టనున్నాయని సమాచారం. ఈ బస్సులు వచ్చాకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలుస్తోంది.