టమాటో జ్యూస్ గుండె ఆరోగ్యాన్నిఎంతో మెరుగు పరుస్తుందని నిపుణులు చెప్తున్నారు. టమాటో జ్యూస్ లో 95 శాతం నీరే ఉంటుంది. దీనితో పాటు విటమిన్ బీ6, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. టమాటోను కూరలో భాగంగా కాకుండా జ్యూస్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. టమోటో జ్యూస్ రోజూ తాగితే 30 రోజుల్లోనే ఎన్నో మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది.