ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో 10.4 ఓవర్‌కు LBWగా రవీంద్ర జడేజా (2) వెనుదిరిగారు. దీంతో ధోనీ క్రీజులోకి వచ్చారు. ప్రస్తుతం 11 ఓవర్లకు చెన్నై స్కోర్ 76/5గా ఉంది. అంతకు ముందు విప్రాజ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (18) పెవిలియన్ చేరారు.