TG: ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ నగరంలోని కవాడిగూడ సీజీవో టవర్స్ 8వ అంతస్తు పై నుంచి ఆమె ఇవాళ దూకడంతో తీవ్రంగా రక్తం కారి, అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసును దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.