ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 16.2 ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు జార్జియా వోల్ 46, ఫోబ్ లిట్చ్‌ఫీల్డ్ 35 రాణించారు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 100 పరుగులకే కుప్పకూలింది. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ 5/19 ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ బ్యాటర్లను బెంబేలెత్తించింది.