పుష్ప 2 సినిమా నిర్మాతలకు, ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యంకు మధ్య షేర్ పంపిణీ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్‌లో షేర్ ఇవ్వాల్సిందిగా నిర్మాతలు కోరడం జరిగింది. ఇతర మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లు అన్నీ 55% డిస్ట్రిబ్యూషన్ షేర్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. కానీ ప్రసాద్ యాజమాన్యం 52% కంటే ఎక్కువ ఇచ్చేది లేదంటూ చెప్పింది. దాంతో నిర్మాతలు ఆ మల్టీప్లెక్స్‌కి పుష్ప2 సినిమా ఇవ్వలేదు.