TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హత కలిగిన లబ్ధిదారుల్లో స్థలాలు లేనివారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త అందించారు. స్థలాలు లేనివారికి ఖాళీగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. మొండి గోడలతో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి గుత్తేదారు ముందుకు రాకుంటే లబ్ధిదారులే పూర్తి చేసుకోవాలని అన్నారు. అందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు.