ఇందిరమ్మ ఇళ్ల పనులకు రేవంత్ సర్కార్ శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 MLC స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.