గుజరాత్‌లో ఓ వ్యక్తి మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. భారీ వరదలు వస్తున్న సమయంలో ఓ కుక్కను నీటిలోకి విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. తనను రక్షించమని ఓ కుక్క ప్రాదేయపడుతున్నట్టు ఈ వీడియోలో చూడొచ్చు. అయినా కనికరం లేకుండా అతడు ప్రవర్తించిన తీరు నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతడికి శిక్ష వేయాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.