AP: విజయవాడలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బెజవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో సాయిబాబు గుడి సమీపంలో అప్పుడే పుట్టిన పాపను ఓ తల్లి చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయింది. మంగళవారం తెల్లవారుజామున పాప ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఆరా తీశారు. ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో పాపను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.