హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ జరగనున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13 నుంచి 15 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈ వేడుకలు జరగనుండడంతో ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్స్ జరగనున్నట్లు అధికారులు వివరించారు.