ఐపీఎల్‌లో భాగంగా ముంబయితో జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్..సాయి సుదర్శన్ (63) బట్లర్ (39) గిల్ (38) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు.