INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.