ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ఆ ఒక్క స్థానం జనసేన నుంచే భర్తీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.