మిరప సాగులో కలుపు యాజమాన్య పద్దతులు!

84చూసినవారు
మిరప సాగులో కలుపు యాజమాన్య పద్దతులు!
మిరపలో దఫదఫాలుగా నీరు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నీరు కట్టిన ప్రతీసారి కలుపు మొలిచే అవకాశం ఉంటుంది. పైరులో సాళ్ళుకమ్ముకున్న తరువాత కలుపు వల్ల పెద్దగా సమస్య లేనప్పటికి, పాయలాకువంటి కలుపు ఆశించినపుడు పైరు నీడలోకూడా పెరుగుతూ నష్టం కలుగజేన్తుంది. ఆక్సిఫ్లూరో ఫెన్‌ 23.5% ఎకరానికి 200 మి.లీ కలుపు మందు 10కిలోలు ఇసుకలో కలువుకుని మొక్కలపైన పడకుండ సాళ్ళమధ్యలో నేలమీద పడేటట్లు చల్లినపుడు పాయలాకు కలుపును నివారించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్