తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా ఆదివారం క్యాపిటల్‌ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మించేందుకు ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్‌ల్యాండ్ ముందుకొచ్చింది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐటీ పార్క్ ఎంతో మందికి ఉద్యోగ ఉపాథి అవకాశాలు లభించనున్నాయి.