కాంగ్రెస్ విషయంలో ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది: అద్దంకి దయాకర్

61చూసినవారు
కాంగ్రెస్ విషయంలో ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది: అద్దంకి దయాకర్
ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటీషన్‌పై హైకోర్టు త్వరగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. స్పీకర్ కు సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వడం ఆహ్వానించదగినదని, స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంశంలో కూడా ఇదేవిధంగా స్పందిస్తే బాగుండేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందని తెలుసుకోవాలని అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్