TG: దేశానికి రైతు అన్నం పెడితే.. జవాన్ ఆ దేశానికి రక్షణగా నిలబడతాడు. అందుకే జై జవాన్.. జైకిసాన్ అంటాము. తాజాగా కిసాన్‌కు జవాన్ తోడై చేయూతనిచ్చిన వీడియో ఆకట్టుకుంటోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతులు వడ్లు ఆరబోశారు. అయితే ఒక్కసారిగా వర్షం రావడంతో వడ్లు తడిసిపోతుంటే.. అటుగా వెళ్తున్న జవాన్లు వాహనానికి ఆపి, వడ్లపై కవర్లు కప్పి రైతులకు సహాయం చేశారు.