జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ధర్మపురి ఎమ్మెల్యే 108 అంబులెన్స్ సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా అనారోగ్యం పాలైనట్లయితే తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తున్నటువంటి 108 అత్యవసర సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.