మెట్‌పల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, నూతనంగా పదవి బాధ్యత చేపట్టిన వ్యవసాయ మార్కెటు కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగు గంగాధర్ ను మున్నూరు కాపు సంఘ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బూర్గుల గంగారెడ్డి, ఉప అధ్యక్షులు బోడ్ల రాహుల్, బోడ్ల నరేష్, మున్నూరు కాపు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.