జగిత్యాల: రేపు ప్రజాపాలన విజయోత్సవాలు: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్విఎల్ఆర్ గార్డెన్ లో సాయంత్రం 6 గంటలకు సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజల కళా బృందంచే జయ జయహే ప్రజాపాలన పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.