పొంగులేటిపై కేసు కూడా నమోదు చేయలేదు: కేటీఆర్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాల వ్యవహారంపై కేటీఆర్ మరోసారి స్పందించారు. ఈడీ దాడులు చేసి జరిగి నెల రోజులు గడిచినా ఎలాంటి అప్డేట్ లేదన్నారు. 'ఈడీ, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట రావట్లేదు. భారీగా నగదు దొరికినట్లు మీడియాలో వచ్చినా కేసు కూడా ఫైల్ చేయలేదు. రైడ్స్ తర్వాత అదానీ హైదరాబాద్ వచ్చి రహస్యంగా పొంగులేటితో భేటీ అయ్యారు. ఇక్కడ క్విడ్ ప్రో కో ఏంటి? మీకేమైనా తెలుసా?' అని Xలో నెటిజన్లను ప్రశ్నించారు.