ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్‌ను కొకైన్ కేసులో సిడ్నీ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. 2021లో కేజీ కొకైన్ డీల్‌లో నేరుగా పాల్గొనలేదని నిర్ధారించినప్పటికీ, అతనికి తెలియకుండానే డ్రగ్ పంపిణీ వ్యవహారంలో భాగమయ్యాడని కోర్టు తేల్చింది. తుది శిక్షను ఎనిమిది వారాల్లో ఖరారు చేయనుంది. 54 ఏళ్ల మాజీ లెగ్‌స్పిన్నర్ ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టులు ఆడి 208 వికెట్లు పడగొట్టాడు.