అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగడంతో కళ్లముందే విమానం దగ్ధమైంది. మంటలు అంటుకోవడానికి కొన్ని నిమిషాల ముందే విమానం నుంచి ప్రయాణికులు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.