బాక్సాఫీస్ వద్ద ‘కల్కి 2898AD’ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హిందీలోనూ ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా హిందీ వర్షన్‌లో రూ.45.75 కోట్లు రాబట్టింది.