నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం వారసంత, రోజువారీ సంత వేలంపాట ఎంపీడీఓ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించారు. గ్రామ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు పాల్గొని వారసంత 8 లక్షల 5 వేల రూపాయలు సలీం పాడారు. రోజు వారి సంత 1, 15, 000 రూపాయలకు గాండ్లా సంతోష్ వేలం పాడారు. వేలంపాట తగ్గడంతో ఎంపీడీవో వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.