కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని జర్నలిస్టు కాలనీలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జర్నలిస్టు కుటుంబాల సభ్యులు బోనాలతో ఊరేగింపు వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.