కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పీఆర్టీయూ మండల అధ్యక్షులు నర్వ శ్రీనివాస్ మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు నరసింహ చారిలను మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిలో విద్యార్థులు ప్రతిభ చాటడం అభినందనీయం అన్నారు.