బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులో కొన్ని కుటుంబాలకు త్రాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న సమస్యను తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ శనివారం తాగునీటి సమస్యను పరిష్కరించారు. 16 వార్డ్ లోని జండాగల్లిలో పైప్ లైన్ మూసుకుపోవడంతో తమ కుటుంబాలకు చాలా రోజులుగా త్రాగునీరు రావడంలేదని పలువురు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకురావడంతో ఈ సమస్య పరిష్కారమైంది.