తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకంచేసిన బిఆర్ఎస్ శ్రేణులు

64చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం తెలంగాణ తల్లి చిత్రపటానికి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బారాస కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ తల్లి పేరిట కాంగ్రెస్ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా విగ్రహం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జుబేర్, గణేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్