కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు MRC లో పనిచేస్తున్న MIS కో ఆర్డినేటర్లు, EIRP లు, మెసెంజర్లు, పాఠశాలలో పనిచేస్తున్న CRP లను రెగ్యులైజ్ చేయాలనీ, వారికీ ఉద్యోగభద్రత కల్పించాలని సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మంగళవారం బాన్సువాడ మండలం కోనపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.