బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికకై శుక్రవారం ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల లబ్ధిదారులకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.