బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి వెనకాల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకలతో నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలికా షెడ్డు నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎజాస్, మోహన్ నాయక్, గోపాల్ రెడ్డి, పిట్ల శ్రీధర్, భాస్కర్ పాల్గొన్నారు.