కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో గురువారం దుర్గాభవాని అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా గత 25 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అష్టదశ శక్తి పీఠాలను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.