బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణం రాములు, జ్యోతి భద్రయ్య ఉగాది మహోత్సవం యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, భూమ్ రెడ్డి, తుప్తి నాగరాజు, రాజు, చిదుర శివకుమార్, ర్యాల విట్టల్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.