మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి... చైర్మన్ కాసుల

60చూసినవారు
మహాత్మా గాంధీజీ చూపిన బాటలో నడిచి ఆయన స్ఫూర్తితో ముందుకు నడిచినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్