బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ విచ్చేసి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, గంగుల గంగారం, గోపాల్ రెడ్డి, కుమ్మరి రాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.