ముమ్మరంగా బీజేపీ నాయకుల ప్రచారం

82చూసినవారు
ముమ్మరంగా బీజేపీ నాయకుల ప్రచారం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం టౌన్ లో శనివారం ఉదయం బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో అశోక్, రాజ్, శివ, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్