జుక్కల్: ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు

65చూసినవారు
జుక్కల్: ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావును కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. జమ్మి ఆకులను ఇచ్చి ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమలో పార్టీ సీనియర్ నాయకులు హన్మంత్ రావ్ దేశాయ్, అంత పటేల్, అంతేశ్వర్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్