మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే తెలంగాణ అమరవీరుల స్థూపంకు పూలు వేసి నివాళ్లు అర్పించారు., తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల యొక్క త్యాగాలను మరువలేమని, వారి యొక్క త్యాగ ఫలితం వలనే తెలంగాణను సాధించుకోవడం జరిగిందని అన్నారు.