పిట్లంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

55చూసినవారు
పిట్లంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి నీలకంటి సంతోష్, చేనేత సంఘం సభ్యులు మరగల దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్