నిజాంసాగర్ మండలం మల్లూరులో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు, నిజంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం గ్రామంలోని స్మశాన వాటిక ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో నలుగురిని అరెస్టు చేసి వారివద్ద నుండి సుమారు రూ. 11, 540 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.