జుక్కల్: షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బుధవారం పిట్లం మండలం కుర్తి రైతులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇప్పటి ప్రభుత్వం గోన సంచులను మార్చి ముద్ర కూడా రైతులు వేసుకోవాలని తెలుపుతుందని సన్న రకం వడ్లను మిషన్ ద్వారా చూడటం ఏంటని వారు ఆందోళన తెలిపారు.