పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

76చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 2003-2004 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఏకమయ్యారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. కుటుంబ సమేతంగా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్