29న అథ్లెటిక్స్ ఎంపికలు

79చూసినవారు
29న అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 29న ఉదయం 8 గంటలకు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ పురుషులు, మహిళలతో పాటు అండర్- 8, 10, 12, 14, 16, 18, 20 విభాగాలలో బాలబాలికలకు 50, 80, 100, 400, 800 మీటర్ల పరుగు తదితర అంశాలలో పోటీలు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్