ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రముఖ వ్యాపారస్థుడు పండరీ వెంకటేశం కుమారుడు అయ్యప్ప మాలలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు. అయ్యప్పస్వామికి అభిషేకాలు చేయించి, రాత్రి 11గంటలకు 18మెట్ల పడి వెలిగించి పడి పూజ చేసి, పూజకు హాజరైన అయ్యప్ప స్వాములకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. అయ్యప్ప ఆలయ పూజరి పంతులు పడి పూజ చేశారు.