ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ కు చెందిన రహీమాబేగం అనే నిరుపేదరాలి ఇళ్లు ఇటీవల వర్షాలకు కూలిపోయింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఈ విషయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శుక్రవారం కూలిపోయిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.