నాగిరెడ్డిపేట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ గౌడ్ 2024 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు, మిస్సింగ్ కేసులను సకాలంలో చేదించినందుకు ఉన్నతాధికారులు గమనించి విధులను సక్రమంగా నిర్వహించినందుకు గురువారం కామారెడ్డిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీతో ప్రశంస పత్రం అందుకున్నారు. ప్రశంస పత్రం అందుకున్న సురేష్ గౌడ్ ని ఎస్సై మల్లారెడ్డి, సిబ్బంది, మండల ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.