రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా 6గ్యారంటీలను అమలు చేసిన ఘనత సిఎం రేవంత్ రెడ్డిదే అని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. గురువారం మండలంలోని కళ్యాణి, మల్కాపూర్ గ్రామాల్లో, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొన్నారు.