ఐవిఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొండ శైలేందర్ ఆధ్వర్యంలో
ఎల్లారెడ్డి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొండ శైలేందర్ గుప్తా మాట్లాడుతూ.... ఉప్పల స్వప్న జన్మదినం జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక గొప్ప మానవతావాది, గొప్ప దాత, సంఘ హితమే పరమావధిగా నడుచుకునే ఒక పెద్దమనిషి, అనుక్షణం సమాజానికి అనుక్షణం ఏమైనా చేయాలని దృడ సంకల్పంతో ఉన్న గొప్ప నాయకురాలు, స్వప్న వదిన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కరోనా టైంలో సంవత్సరంపాటు అన్నదానం నిర్వహించడం జరిగింది.
అంతేకాకుండా పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. పేదింటి ఆడపిల్లకు పెళ్లి భారం కాకూడదని ఎంతో మందికి పూస్తే మట్టెల్లు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఇలాంటి వాళ్లకు స్టడీమెటీరియల్స్ కూడా ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అందు గురించే ఇలాంటి గొప్ప మానవతావాది జన్మదినాన్ని పండుగల నిర్వహించడం వల్ల సమాజంలో ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని వీరి అడుగుజాడల్లో నడుస్తా అని ఆశిస్తున్నా అని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్ కొండ శైలేందర్ గుప్త, ఉప్పల శీనన్న ఎల్లారెడ్డి యువజన సంఘం సభ్యులు మహేష్ కుమార్, సతీష్ కుమార్, పలువురు యువ నాయకులు పాల్గొన్నారు.